ఓజోన్ రన్‌..అతిథిగా ఎంపీ సంతోష్

63
- Advertisement -

హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో ఓజోన్ రన్ 2 వ ఎడిషన్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఎంపీ సంతోష్ కుమార్. ఓజోన్ రన్ లో బాగంగా 10k,5k,2k రన్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రన్నర్స్ కి ట్రోఫీలను ఎంపీ సంతోష్ కుమార్ అందజేశారు.గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్వర్యంలో విత్తన గణపతులు పంపిణీ చేశారు.

ఓజోన్ రన్ వ్యవస్థాపకులు బిల్వోవా వున్నం,తీర్ధా వున్నం ల చొరవను అభినందించారు. ఓజోన్ రన్ వ్యవస్థాపకురాలు మేఘనా ముసునూరి, సెక్రటరీ శ్రీధర్ వున్నం నేతృత్వంలోని SWAN (సేవ్ వాటర్ అండ్ నేచర్) చొరవ తో పర్యావరణ పరిరక్షణ కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు దాదాపు వెయ్యికి పైగా రన్నర్స్ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారని తెలిపారు..

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ,కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్,మాదాపూర్ డిసిపి సందీప్,గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Also Read:అతిథి..ఎంటర్‌టైన్ పక్కా

- Advertisement -