పుష్ప 2 వెనక్కి తగ్గాల్సిందేనా ?

36
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న మూవీ పుష్పా ది రూల్. 2021 లో విడుదపై ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన పుష్ప పార్ట్ 1 ను సిక్వల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇండియా వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప పార్ట్ 1 మూవీకి గాను బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డ్ రావడంతో పార్ట్ 2 పై హైప్ రెట్టింపు అయింది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని వచ్చే ఏడాది ఆగష్టు 15 న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇటీవల అఫిషియల్ గా ప్రకటించారు.

దీంతో పుష్పరాజ్ రూల్ కు తిరుగు లేదని భావించారంతా. కానీ ఇదే డేట్ లో విడుదల కావడానికి మరో రెండు భారీ సిక్వల్ మూవీస్ సిద్దమౌతుండడంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్ క్లాస్ తప్పెలాలేదు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న సింగం రిటర్న్ ( సింగం 3 ) మూవీ 2024 ఆగష్టు 15 ననే రిలీజ్ అవ్వబోతున్నట్లు సమాచారం. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సింగం, సింగం 2 మూవీస్ మంచి విజయాన్ని అందుకున్నాయి.

దాంతో మూడవ భాగంగా రాబోతున్న సింగం 3 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక శంకర్ దర్శకత్వంలో లోక నాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 మూవీ కూడా వచ్చే ఏడాది ఆగష్టు 15ననే విడుదల చేసేందుకు మేకర్ రెడీ అవుతున్నారట. ఇదే గనుక జరిగితే ఇటు తమిళ్ లోనూ అటు నార్త్ లోనూ అల్లు అర్జున్ కు పోటీ తప్పెలా లేదు. అయితే పుష్ప 2 పై ఉన్న క్రేజ్ కారణంగా బన్ని పోటీకి సై అంటాడా ? లేదా సోలోగా వచ్చేందుకు వెనక్కి తగ్గుతాడా ? అనేది చూడాలి.

Also Read:Sudheer Babu:మామా మశ్చీంద్ర..సాంగ్

- Advertisement -