ముక్కోటి వృక్షార్చన…ప్రారంభించిన ఎంపీ సంతోష్

84
santhosh

ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ప్రారంభించారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆద్వర్యంలో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు మూడు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

సింగరేణి ఎనిమిదవ ఇంక్లైన్ అబ్దుల్ కలాం స్టేడియంలో మొక్కలు నాటారు ఎంపీ సంతోష్ కుమార్. స్థానిక నాయకులు, సింగరేణి అధికారులు, ఉద్యోగులతో కలిసి ఒకే చోట పదివేల మొక్కలు నాటారు. రామగుండంలో ఇవాళ ఒక్కరోజే ఐదు లక్షల మొక్కలు నాటనున్నారు స్థానికులు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కొలేటి దామోదర్, రామగుండం మేయర్ డాక్టర్ అనిల్, సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ బలరామ్, కార్పోరేషన్ కమిషనర్ ఉదయ్ కుమార్, పోలీస్ కమిషనర్ సత్యరాయణ పాల్గొన్నారు.