తండ్రైన హీరో ఆర్య..

82
sayesha

కోలీవుడ్ హీరో ఆర్య తండ్రయ్యారు. 2019 మార్చి 10న హీరోయిన్ సయేషా సైగల్‌ను పెళ్లి చేసుకున్నారు. తర్వాత సయేషా సినిమాలకు దూరం కాగా ఆర్య తండ్రయ్యాడనే విషయాన్ని వెల్లడించారు హీరో విశాల్.

ఈ వార్తను బ్రేక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అంకుల్ గా ఉన్నందుకు చాలా బాగుంది, నా బ్రో జమ్మీ & సయేషా ఆర్ బ్లెస్డ్ విట్ # బేబీగర్ల్. కంట్రోల్ చేసుకోలేని భావోద్వేగాలు ఇప్పుడు షూట్ మధ్యలో ఉన్నాయి అని ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు విశాల్.

ఆర్య ఇటీవల నటించిన చిత్రం “సర్పట్ట పరంపరై” భారీ హిట్‌ గా నిలిచింది. మరోవైపు ఆర్య, విశాల్ ఇద్దరూ కలిసి “ఎనిమీ” అనే చిత్రంలో నటించనున్నారు. భ‌లేభ‌లే మ‌గాడివోయ్ రీమేక్ గజినీకాంత్ సినిమాలో కలిసి నటించారు ఆర్య- సయేషా. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా వాళ్లిద్ద‌రి జోడీ మాత్రం సూప‌ర్ హిట్ అయింది.