ఎంపీ సంతోష్‌కు మంత్రి గంగుల కృతజ్ఞతలు..

268
Minister Gangula Kamalakar

పేదల ఆకలి తీర్చాలని ఇచ్చిన సిఎం కెసిఆర్ పిలుపు మేరకు ఎంపీ సంతోష్ కుమార్ వలస కూలీలకు నిత్యం అన్నదానం చేయడం అభినందనీయమన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ లోని 34వ డివిజన్ లో SBS ఫంక్షన్ హాల్ లో మూడో రోజు నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావులు ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల నుంచి కూలీ పని కోసం కరీంనగర్ వచ్చి లాక్ డౌన్ తో ఉపాధి కరువైన వలస కూలీలకు మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావులు స్వయంగా భోజనం వడ్డించారు.

ఈ సంధర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… తెలంగాణలో రెండు కోట్ల 81 లక్షల మందికి 11 వందల కోట్ల ఖర్చుతో ఆకలి తీర్చిన మహానుభావుడు సీఎం కేసీఅర్ అని మంత్రి గంగుల కొనియాడారు. వేరే రాష్ట్రం నుంచి తెలంగాణకు వలస వచ్చిన కార్మికులకు ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం, 500 నగదు అందిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఅర్ పిలుపు మేరకు కరీంనగర్ గడ్డపై పుట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గత కొన్ని రోజులుగా వలస కూలీలకు నిత్యం అన్నదానం చేస్తూ తనలోని మానవత్వాన్ని చాటుకుంటున్నారని తెలిపారు.

Minister Gangula Kamalakar

పొట్ట కూటి కోసం కరీంనగర్ కు వచ్చి… పని లేక ఆకలికి అలమటించకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన పిలుపును స్వీకరించిన ఎంపీ సంతోష్ కుమార్ ఎంతో మంది కూలీల ఆకలిని తీరుస్తున్నారని తెలిపారు. ప్రాంత భేదాలు లేకుండా వలస కార్మికుల కడుపు నింపుతున్న సీఎం కేసీఅర్, ఎంపీ సంతోష్ కుమార్ లకు మంత్రి గంగుల కృతజ్ఞతలు తెలిపారు. లాక్ డౌన్ ముగిసే వరకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి రోజు నిర్వహిస్తామని ప్రకటించారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో ప్రతి టీఅర్ఎస్ కార్యకర్త కూడా భాగస్వాములవుతారని పేర్కోన్నారు.

Minister Gangula Kamalakar

మేయర్ సునిల్ రావు మాట్లాడుతూ… గత కొద్ది రోజుల నుండి కరీంనగర్ లో ఎంతో మంది కూలీలకు అన్న పెడుతు వారి ఆకలిని తీర్చిన మహానుబావుడు ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు.కరోనా వైరస్ విపత్తు నేపథ్యంలో కూలీలకు పని దొరకక ఆకలితో అలమటిస్తారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆలోచన చేసి… 12 కి.లో బియ్యం 500 రూ. కూడ అందిస్తున్నారని తెలిపారు. పేదల కడుపునింపుతున్న సీఎం కేసీఅర్, ఎంపీ సంతోష్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు.