భద్రకాళి ఆలయంలో గ్రీన్ ఛాలెంజ్‌….

62
mp santhosh

వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ఎంపీ సంతోష్ కుమార్. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌లతో కలిసి దర్శించుకోగా ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఎంపీ సంతోష్‌కు అందజేశారు ఆలయ పూజారులు.

అనంతరం ఆలయ ప్రాంగణలో మొక్కలునాటారు. ఎమ్మెల్యే క్యాoపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో పాటు మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తదితరులు ఉన్నారు.