ఎఫ్‌ 3…షూటింగ్ ప్రారంభం

67
f3

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌- వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఎఫ్‌ 2. సంక్రాంతి రేసులో వచ్చిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకోగా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ బర్త్ డే సందర్భంగా ఎఫ్‌ 3 పోస్టర్‌ని రిలీజ్‌ చేయగా తాజాగా సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో నామమాత్రంగా షూటింగ్‌ను మొదలు చేశారు. అసలు పూర్తి షూటింగ్ ఈ నెల 23నుంచి ప్రారంభం కానుందని ..ఈ ఫోటోలను చిత్ర యూనిట్ షేర్ చేసింది.

ఈ సినిమా కుటుంబం వల్ల వచ్చే ఫ్రస్ట్లరేషన్, ఫన్ గురించి కాదని, ఇందులో ఫన్‌కు వేరే కారణాలు ఉంటాయని దర్శకుడు అనిల్ తెలిపారు. ఎఫ్3ను ఎఫ్2తో పోలీస్తే కథ పూర్తి వేరుగా ఉంటుందని తెలిపారు.