సంతన్న బర్త్ డే..మొక్కలు నాటిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

531
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు, సంతన్న అభిమానులు మొక్కలు నాటుతున్నారు. తన పుట్టిన రోజున ఎటువంటి అంగు, ఆర్భాటాలే లేకుండా నా అభిమానులు మొక్కలు నాటాలని ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాగా సంతన్న పుట్టిన రోజు సందర్భంగా సికింద్రాబాద్ లోని జింఖాన మైదానంలో మొక్కలు నాటారు రాష్ట్ర క్రీడా, ఆబ్కారీ , పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.

srinivas Goud Green

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు తెలంగాణ కు హరితహారం కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ చాలంజ్ ను నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా అందరినీ భాగస్వామ్యం చేస్తూ , గ్రీన్ ఛాలెంజ్ రాష్ట్ర, దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు పాల్గొని విజయవంతం చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. క్రీడాకారులు ప్రతి ఒక్కరూ గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, MD దినకర్ బాబు, క్రీడాకారులు పాల్గొన్నారు.

- Advertisement -