పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీ సభ్యుడిగా సంతన్న

243
mp santhosh
- Advertisement -

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నివేదికలు, ఖాతాలను మదింపుచేసి, వాటి పనితీరుపై పార్లమెంట్‌కు నివేదికలు సమర్పించే పబ్లిక్‌ అండర్‌టేకింగ్స్‌ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌కుమార్‌ ఎంపికయ్యారు. ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 15, రాజ్యసభ నుంచి ఏడుగురు కలిపి మొత్తం 22 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రాధాన్య ఓటు ఆధారంగా రెండు సభల నుంచి కమిటీ సభ్యులను ఎన్నుకొంటారు.

జాతీయ స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును మెరుగుపరిచేందుకు మార్గదర్శకంగా నిలిచే ఈ కమిటీ 1964 సంవత్సరం నుంచి పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల నివేదికలను అధ్యయనం చేయటం, వాటి ఖాతాలను పరిశీలించటంతో పాటు, మరింత మెరుగ్గా పనిచేసేందుకు వీలుగా ఈ కమిటీ కేంద్రానికి నివేదికలు అందజేస్తుంది.

అత్యంత ప్రాధాన్యత కలిగిన పార్లమెంటరీ కమిటీకి తాను ఎంపిక కావటంపై  సంతోష్ కుమార్ సంతృప్తిని వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యుడిగా తన బాధ్యత మరింత పెరిగిందని వెల్లడించారు. తెలంగాణ నుంచి ఈ కమిటీకి ఎంపికైన తొలి ఎంపీ సంతోష్ కావడం విశేషం. ఈ కమిటీ చైర్మన్‌ను లోక్‌సభ స్పీకర్‌ నియమిస్తారు.

- Advertisement -