రామన్నకు జన్మదిన శుభాకాంక్షలు: ఎంపీ సంతోష్

103
ktr

తండ్రికి తగిన తనయునిగా, టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షునిగా, మంత్రిగా,తెలంగాణ యువతకు ఐకన్‌గా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించకున్న ప్రజానేత కేటీఆర్. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్ష‌లు వెలువెత్తున్నాయి.

ఎంపీ సంతోష్‌ సైతం రామన్నకు బర్త్ డే విషెస్ తెలిపారు. ప్రియమైనవారి పుట్టినరోజు ఎల్లప్పుడూ ప్రత్యేకమైనది అదే మీ ప్రియమైన సోదరుడి అయితే దాని ప్రత్యేకత ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మీలాంటి అన్నయ్యను ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఎంపీ సంతోష్.

మంత్రి కేటీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్, గంగుల క‌మ‌లాక‌ర్, నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జ‌గ‌దీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు హ‌రిప్రియ‌, జోగు రామ‌న్న‌, దివాక‌ర్ రావు, చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, కాలేరు వెంక‌టేశ్, క‌ల్వ‌కుంట్ల విద్యాసాగ‌ర్ రావు, మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి, చిరుమ‌ర్తి లింగ‌య్య‌, కొనేరు కోన‌ప్ప‌, రాజేంద‌ర్ రెడ్డి, చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి, గ్యాద‌రి కిశోర్ కుమార్, బాపురావు రాథోడ్, వొడితెల స‌తీష్ కుమార్, సుంకె ర‌విశంక‌ర్, భీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి, సైదిరెడ్డి శానంపూడి, సంజ‌య్ కుమార్, భేతి సుభాష్ రెడ్డి, పైళ్ల శేఖ‌ర్ రెడ్డి, ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి తదితరులు ఉన్నారు.