మంత్రిగా పట్నం..ఎంపీ రంజిత్ విషెస్

25
- Advertisement -

కేబినెట్ విస్తరణలో భాగంగా మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు పట్నం మహేందర్ రెడ్డి. తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పైలట్ రోహిత్ రెడ్డిని ప్రకటించగా ఇదే స్ధానంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన పట్నం ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండగా ఆయనకు మంత్రివర్గ విస్తరణ నేపధ్యంలో ఛాన్స్ దక్కింది. రేపు(గురువారం) మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు పట్నం. ఈ నేపథ్యంలో ఆయనకు విషెస్ తెలిపారు ఎంపీ రంజిత్ రెడ్డి.

2014 ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌లో చేరిన మహేందర్‌రెడ్డి తాండూరు నుంచి గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థి పైలట్‌ రోహిత్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రోహిత్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డికి మంచి పట్టు ఉంది.

- Advertisement -