గుడిగుడికో జమ్మి చెట్టు….అపూర్వ స్పందన

131
mp
- Advertisement -

గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ దసరా పండగ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఊరు ఊరికో జమ్మి చెట్టు…గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తోంది.

ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన పుట్టినరోజు సందర్భంగా చేవెళ్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టును నాటారు ఎంపీ రంజిత్ రెడ్డి.ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటుతున్నానని అయితే ఈ సంవత్సరం గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టిన ఊరు ఊరుకో జమ్మి చెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా జమ్మి చెట్టు నాటడం సంతోషంగా ఉందని రంజిత్ రెడ్డి అన్నారు..

తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం అద్బుతమని ఎంపీ రంజిత్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య,టీఆరెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -