దేశంలో 24 గంటల్లో 35,662 కరోనా కేసులు…

57
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 35,662 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 3,34,17,390కి చేరింది. కరోనా నుండి 3,26,32,222 మంది కోలుకోగా 3,40,639 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 17 వరకు 55,07,80,273 కరోనా టెస్టులు చేయగా 14,48,833 మందికి పరీక్షలు చేశామని వెల్లడించింది ఐసీఎంఆర్.