గిరిజన విద్యార్థికి చేయూతనందించిన ఎంపీ రంజిత్ రెడ్డి…

182
ranjith
- Advertisement -

దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించారు ఎంపీ రంజిత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కొర్విచెడ్ తండాకు చెందిన రాథోడ్ శంకర్ కమిలిబాయి దంపతులు కూలీ పనులు చేస్తూ కొడుకు రాథోడ్ నరేష్ ను చదివిస్తున్నారు.నరేష్ చిన్నప్పటి నుంచి చదువులో చురుకైన వాడు అలా తాండూరు లో ఇంటర్ పూర్తి చేసి సంగారెడ్డిలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో డిగ్రీ లో చేరాడు.

తృతీయ సంవత్సరం చదువుతూ ఐఐఎం పరీక్ష రాసి సీటు సంపాదించాడు.ఐఐఎం కు ఏటా 2 నుంచి 3 లక్షల మంది విద్యార్థులు పోటీపడుతుండగా కేవలం 5వేల మందికి మాత్రమే సీటు లభిస్తుంది.ఇందులో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన గిరిజన పుత్రుడు నరేష్ ఎంపిక కావడం విశేషం.రాథోడ్ శంకర్, కమిలిబాయి దంపతులు కూలీ పనులు చేసి కొడుకును చదివిస్తున్నారు.కష్టపడి చదివిన నరేష్ ఐఐఎంలో సీటు సాధించాడు.

ఇందులో అడ్మిషన్ పొందాలంటే రూ.2 లక్షలు కట్టాల్సి వుంటుంది.ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు నరేష్ ను చదివించలేక సతమతమవుతున్నారు.ఈ వార్త ను చూసి చలించిపోయిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆ కుటుంబాన్ని తన నివాసానికి పిలిపించుకొని 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందచేశారు.ఎంపీ రంజిత్ రెడ్డి గారి సహాయం మరువలేనిదన్నారు విద్యార్థి రాథోడ్ నరేష్. తన చదువు కొరకు ఆర్థిక సహాయం చేసిన ఎంపీ రంజిత్ రెడ్డి గారికి ఋణపడి ఉంటాను.వారి సహాయం మరువలేనిదన్నారు.

- Advertisement -