లే లడఖ్‌లో మొక్కలు నాటిన ఎంపీ రాములు

208
mp ramulu
- Advertisement -

నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అభినందనలు వెల్లివిరిశాయి. ఎంపీ పోతుగంటి రాములు గారికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తో పాటు పలువురు ఎంపీలు, మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

స్టడీ టూర్ లో భాగంగా హోమ్ అఫైర్స్ పార్లమెంటు కమిటీ సభ్యుల తో పాటు ఎంపీ రాములు జమ్మూ అండ్ కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఎంపీ పోతుగంటి రాములు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తోటి పార్లమెంటు సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు . అనంతరం ఎంపీ రాములు గారు పార్లమెంటు సభ్యులతో కలిసి లే లడఖ్ లో మొక్కలు నాటారు. అంతరించిపోతున్న అడవులను సంరక్షించడం కోసం తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం, ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతుందని ఎంపీ రాములు పేర్కొన్నారు.

తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ కి , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు, ఎమ్మెల్సీ కవితకు ,మంత్రులకూ ఎంపీలకు ఎమ్మెల్సీలకు మరియు ప్రజలందరికీ ఎంపీ రాములు గారు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -