4వే లైన్‌గా హైదాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి..

147
mp
- Advertisement -

హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిని నాలుగు లైన్ల రోడ్డు గా అభివృద్ధి చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లను నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కోరారు. ఈ మేరకు ప్రధానికి ఎంపీ రాములు వినతిపత్రం సమర్పించారు. జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం పుణ్యక్షేత్రానికి తెలంగాణ తో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారని దీంతో రెండు లైన్ల రోడ్డు ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉందని వినతి లో పేర్కొన్నారు.

పార్లమెంటులో జీరో అవర్లో తాను శ్రీశైలం – హైదరాబాద్ జాతీయ రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయాలని ఇదివరకే కోరడం జరిగిందని ఎంపీ పోతుగంటి రాములు తెలిపారు . ఈ నెల 23న తన పార్లమెంట్ పరిధిలో అచ్చంపేట ప్రాంతంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడు మంది మృతి చెందారని, వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించడం అభినందనీయమని పేర్కొన్నారు.

హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిని తక్షణమే నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేసి ప్రమాదాలను నివారించాలని ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లను తెలంగాణా ఎంపీలు అందరితో తీసుకెళ్ళి ఎంపీ పోతుగంటి రాములు కోరారు.

- Advertisement -