గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన రాహుల్ రావు

111
gic

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తన పుట్టినరోజును పురస్కరించుకుని గోషామహల్ లో మొక్కలు నాటారు TRS పార్టీ యువజన నాయకుడు రాహుల్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుందని అన్నారు.

ఈ మధ్య కాలంలో ఎవరి పుట్టినరోజు వచ్చిన, ఏ శుభకార్యం అయిన ఇతర హంగు ఆర్భాటాలకు, వివిధ రకాల వేడుకలు చేసుకోకుండా కాలుష్యాన్ని తగ్గించడం కోసం మొక్కలు నాటే సాంప్రదాయాన్ని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలోని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ తీసుకురావడం చాలా అభినందనీయం అని తెలిపారు. నేను కుడా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాహుల్ రావు మిత్రులు, TRS పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.