కార్పోరేట్ల లాభంకోసమే వ్యవసాయ చట్టాలు: రాహుల్

37
Rahul

పారిశ్రామిక వేత్తలకు లాభం చేయడానికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని తెలిపారు కాంగ్రెస్ నేత,ఎంపీ రాహుల్ గాంధీ. మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను చేసి దేశంలోని ఇద్ద‌రు ముగ్గురు బ‌డాపారిశ్రామిక‌వేత్త‌ల చేతిలో పెట్టారని విమర్శించారు.

తమిళనాడులోని కరూర్‌లో రోడ్‌ షోలో పాల్గొన్న రాహుల్‌…ప్రధానిపై విమర్శలు గుప్పించారు. మోదీ రైతుల‌పై దాడి చేస్తున్నారు. ఆయ‌న కొత్త‌గా ఆ మూడు చ‌ట్టాలు అమలైతే భారతీయ వ్య‌వ‌సాయ రంగం నాశనమవుతుందన్నారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల్లోని ఒక చ‌ట్టంలో రైతులు త‌మ హ‌క్కుల కోసం కోర్టుకు వెళ్ల‌లేరు అని స్ప‌ష్టంగా ఉందని ఇది ఒక్కటి చాలు ఆ చ‌ట్టాలు రైతుల‌కు ఎంత అపాయ‌క‌ర‌మో చెప్ప‌డానికి అని విమర్శించారు.