రైతుల ర్యాలీపై ఉగ్ర కుట్ర:పోలీసుల హెచ్చరిక

30
farmers protest

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు ట్రాక్టర్ ర్యాలీ తలపెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు 3 లక్షల ట్రాక్టర్లతో రైతులు ర్యాలీ నిర్వహించనుండగా రైతుల ర్యాలీని భగ్నం చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని పోలీస్ వర్గాలు హెచ్చరించాయి.

ట్రాక్టర్‌ ర్యాలీలో విధ్వంసం సృష్టించేందుకు భారీ కుట్రకు ఉగ్రసంస్థలు తెరలేపాయని, ఈ శక్తుల ఆగడాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రైతు సంఘాలకు పిలుపునిచ్చారు. నిషేధిత సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ అనే వేర్పాటువాద సంస్థ వీడియో ఆధారంగా పవర్‌ స్టేషన్లు లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశం ఉందని వెల్లడవడంతో దేశ రాజధాని అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో కిసాన్‌ ర్యాలీ సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.