తన జన్మదిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలపుమేరకు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర్ రావు ఢిల్లీ తన అధికార నివాసం వద్ద మొక్కలు నాటారు. జాతీయ అడవుల పాలసీ లో పేర్కొన్న విదంగా అడవుల విస్తీర్ణం రాష్ట్రం లో 23 శాతం నుండి 33 శాతం పెంచే విదంగా హరితహరం కార్యక్రమం చేపట్టి 230 కోట్ల మొక్కలు నాటి వాటిలో 80 శాతం పైగా మొక్కలు సంరక్షించే చట్టం తెచ్చి తెలంగాణ ని హరిత మయం చేసిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం ప్రారంభించి తెలంగాణ లోనే కాకుండా దేశ విదేశాల్లో సైతం విరిగా మొక్కలు నాటేలా చైతన్యం తీసుకొస్తున్నారు.
ఎంపీ సంతోష్ కుమార్ గారి కృషి అభినందనీయం . గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాడటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఇదే స్ఫూర్తి తో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపును ఇచ్చారు. ఇలాంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం ద్వారా యావత్ తెలంగాణ, యావత్ భారత దేశం పచ్చదంగా మారాలని, సంతోష్ కుమార్ గారు కన్న కలలు సాకారం కావాలని ఆకాంక్షించారు.