పల్లాను గెలిపించండి: ఎంపీ నామా

247
nama
- Advertisement -

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఎంపీ నామా నాగేశ్వర్ రావు. ఖమ్మం పెవిలియన్‌ మైదానంలో ప్రచారం నిర్వహించిన నామా… టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఓటేయాలని వాకర్స్‌ను కోరారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రంలో సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

రాష్ట్రాన్ని అభివృద్ధివైపు తీసుకెళ్తున్న ప్రభుత్వానికి మద్దతునివ్వాలని కోరారు నామా. పట్టభద్రులంతా తమ మొదటి ప్రాధాన్యతా ఓటును పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల పల్లా గెలుపు ఖాయమని నామా విశ్వాసం వ్యక్తంచేశారు.

సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నదని తెలిపారు. 60 సంవత్సరాల్లో జరగాల్సిన ప్రగతిని ఈ ఆరేండ్లలోనే సాధించామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటివరకు 1.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని, మరో 50 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నదని వెల్లడించారు.

- Advertisement -