మాటల చెప్పడం బీజేపీకి కొత్తకాదు: ఎంపీ ప్రభాకర్ రెడ్డి

214
mp prabhakar reddy
- Advertisement -

కాంగ్రెస్,బీజేపీ నేతలకు మాటలు చెప్పడం కొత్తకాదన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. మిరుదొడ్డిలో టీఆర్ఎస్ విద్యార్ధి,యువజన నేతలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన ప్రభాకర్ రెడ్డి… దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు మంత్రి హరీశ్ రావుకు పూర్తి అవగాహన ఉందన్నారు.

బీజేపీకి ఓటు వేస్తే అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ జలాశయ కాలువ అభివృద్ధి పనులు ముమ్మరంగా చేస్తుంటే.. కోర్టు కేసులు పెట్టి అభివృద్ధికి నిరోధకులుగా మారుతూ.. కాంగ్రెస్, బీజేపీ వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.

ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ..టీఆర్ఎస్ అభ్యర్థిని లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీ నేతలు వానకాలం కప్పల మాదిరిగా ఎన్నికలు రాగానే వచ్చిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మిరుదొడ్డి మండల పార్టీ ఇంచార్జి సంగారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -