సొంతపార్టీ వారినే ఇబ్బందులకు గురి చేసిన ఈటల:కెప్టెన్ లక్ష్మీకాంతారావు

72
laxmi

సీఎం కేసీఆర్ ఆదేశిస్తే హుజురాబాద్ నుండి పోటీ చేస్తానని ప్రకటించారు టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు. మాజీ మంత్రి ఈటలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈటల సొంత పార్టీ వారినే ఇబ్బందులకు గురి చేశారని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఈటలను ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదన్నారు. బీసీలకు సీఎం సముచిత స్థానం కల్పించారని చెప్పారు. అసైన్డ్ భూములు కొనరాదని తెలిసికూడా తెలియనట్లు వ్యవహరించడం సమంజసం కాదని సూచించారు.