ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఎంపీ కోమటిరెడ్డి..

112
komatireddy
- Advertisement -

తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపుదల నిర్ణయం పై భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పార్లమెంట్ సమావేశానికి హాజరైన కోమటిరెడ్డి ఆర్టీసీ టికెట్ల పెంపుదలపై ఢిల్లీ నుండి స్పందించారు.

ఇప్పటికే డీజిల్,పెట్రోల్ రేట్లు పెరగటం వల్ల నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి దాంతో పేద, మధ్య తరగతి ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజలని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆర్టీసి ధరలు పెంచి ప్రజలకు రవాణా భారాన్ని కూడా పెంచాలని చూస్తుంది.

కేసీఆర్ ఆర్టీసీ టికెట్ల పెంపు నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఉంది అని ఎద్దేవా చేశారు. వెంటనే ప్రభుత్వం ఆర్టీసీ టికెట్ల పెంపు నిర్ణయాన్ని వెనిక్కి తీసుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.

- Advertisement -