డీకే అరుణకు ఎంపీ కిరణ్ కౌంటర్

14
- Advertisement -

బీజేపీ ఎంపీ డీకే అరుణకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రేషన్ కార్డులలో మోదీ ఫోటో పెట్టాలంటే ప్రస్తుతం ఉన్న 90 లక్షల కార్డులకు కేంద్ర ప్రభుత్వమే బియ్యం ఇవ్వాలన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో 90 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉంటే.. 54 లక్షల కార్డులకు 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నాం అన్నారు. మిగతా 34 లక్షల రేషన్ కార్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 54 లక్షల కార్డులకు ఒక కేజీ చొప్పున అదనపు బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందన్నారు.

ప్రతి నెల దీనిపై రూ.352 కోట్ల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Also Read:కుంభమేళాలో పవన్ కళ్యాణ్

- Advertisement -