బీఆర్ఎస్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం

13
- Advertisement -

ఇవాళ తెలంగాణ భవన్‌లో రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేయనున్నారు. 2001 ఏప్రిల్‌ 27న ఆవిర్భవించిన బీఆర్‌ఎస్‌ పార్టీ 25వ వసంతంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో భారీ బహిరంగసభను నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు సమావేశానికి హాజరుకానున్నారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వ ర్‌ జూబ్లీ వేడుకల నిర్వహణతోపాటు సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృతస్థాయిలో చర్చించనున్నట్టు వర్కింగ్‌ ప్రెసిడెం ట్‌ కేటీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు.

Also Read:పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు..

- Advertisement -