TTD:పెద్ద‌శేష వాహ‌నంపై కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

7
- Advertisement -

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు మంగ‌ళ‌వారం రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ప‌ర‌మ‌ప‌ద వైకుంఠ నాథుని అలంకారంలో కటాక్షించారు.

అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని సేవించుకున్నారు.

శేషుడు స్వామివారికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలె నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు బోధిస్తున్నారు.

Also Read:కుంభమేళాలో పవన్ కళ్యాణ్

- Advertisement -