“గిఫ్ట్ ఎ హెల్మెట్” కు విశేష స్పందన

202
kavitha gift a helmet
- Advertisement -

అన్నా చెల్లెల్లు.. అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ఇవాళ దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. అయితే గతేడాది నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాఖీట్ల పండుగ వచ్చిందంటే రాఖీలతో పాటు మరో పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. అదే గిఫ్ట్ ఎ హెల్మెట్.

sister4cause

ఈ ఛాలెంజ్‌ తెలంగాణలో ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అక్కచెల్లెల్లు అన్నాదమ్ములకు రాఖీలు కట్టడం, రాఖీ కట్టిన అక్కాచెల్లెల్లకు అన్నాదమ్ములు అంతో ఇంతో కట్నం ఇచ్చి కాల్లు మొక్కి ఆశీర్వచనం పొందడం ఆనవాయితి. దీంతో పాటు ఇప్పుడు గిప్ట్‌ ఎ హెల్మెట్‌ ఛాలెంజ్‌కు కూడా వైరల్‌గా మారింది. అక్కాచెల్లెల్లు తమ సోదరులకు రాఖీలు కట్టడంతో పాటు హెల్మెట్‌లను గిప్టుగా ఇవ్వడం ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంది. తమ సోదరులు క్షేమంగా ఉండాలంటూ హెల్మెట్‌లను అందిస్తున్నారు సోదరీమణులు.

sister4cause

గతేడాది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపుతో ఈ గిప్ట్‌ ఫర్‌ హెల్మెట్‌ క్యాంపెయిన్ మొదలైంది. తమకు అన్ని వేళలా రక్షణగా ఇచ్చే తమ సోదరుల భద్రతను కోరుతూ సోదరిమణులు ఈ హెల్మెట్‌లను బహుకరించాలని ఈ క్యాంపెయిన్‌ ప్రారంభించారు ఎంపీ కవిత. క్యాంపెయిన్ ప్రారంభించినప్పటి నుండి ప్రతి రాఖీట్ల పండుగ నాడు ఎంపీ కవిత స్వయంగా తన అన్న మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి హెల్మెట్‌ను కానుకగా ఇస్తుంది. కవితను స్పూర్తిగా తీసుకున్న సోదరీమణులు మత సోదరులకు రాఖీకట్టడంతో పాటు హెల్మెట్ లను గిప్టులుగా ఇచ్చారు. గత కొంత కాలంగా సాగిన ఈ గిప్ట్ ఫర్‌ హెల్మెట్‌ క్యాంపెయిన్ కు మంచి స్పందనే వచ్చింది. మొత్తానికి తెలంగాణలో గిప్ట్‌ ఫర్‌ హెల్మెట్‌ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందనే చెప్పాలి.

- Advertisement -