“దేవదాస్” లో నేను చేసిన పాత్ర..- బాలు

213
SP Balu doing a special role in Devadas

నాచురల్ స్టార్ నాని, కింగ్ నాగార్జున, జంటగా నటిస్తున్న దేవదాస్ చిత్రం పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయ్. ఇటీవల రిలీజ్ ఐన టీజర్ తో ఆ అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నాగ్,నాని ఇద్దరు మందు కొడుతూ కనిపించడం ప్రేక్షకులకి చాలా సరదాగా, ఆకర్షించేలా ఉండటం తో ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ సినీ గాయకుడు S.P బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమాలో తాను కూడా నటించినట్టు చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు.

SP Balu doing a special role in Devadas

ఒకప్పుడు ప్రేమికుడు సినిమాలో ఆయన చేసిన పాత్ర ఆయనకీ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత కొన్ని సినిమాల్లో ఆయన నటించి ప్రేక్షకులను మెప్పించారు కూడా. ఆయన నటించిన “మిథునం” సినిమా ఉత్తమ చిత్రంగా అవార్డులు అందుకున్న సంగతి మనకి తెలిసిందే. కానీ ఆ సినిమా తర్వాత ఆయన వేరే ఏ సినిమాలోనూ నటించలేదు. కారణం ఏంటి అని అడిగితే తనని చాలామంది దర్శకులు పాత్రలు చేయమని అడుగుతున్నా అవి తనకి నప్పవేమో అన్న సందేహంతో చేయలేదని, ప్రస్తుతం దేవదాస్ సినిమాలోని తన పాత్ర కొంతసేపే ఉన్నప్పటికీ మంచి గుర్తింపు తెచ్చేలా ఉంటుందని బాలు చెప్పారు.

SP Balu doing a special role in Devadas

పాత్ర వివరాలను ఆరా తీస్తే ఓ హాస్పిటల్ డీన్ గా చేస్తున్నట్టు, అందులో అవయవదానం గురించి మంచి సందేశం ఇచ్చే పాత్ర కావడంతో తాను ఒప్పుకున్నట్టు తెలిపారు బాలు. ఏది ఏమైనా దేవదాస్ సినిమా రోజుకో కొత్త వార్తను మోసుకొస్తూ అంచనాలను పెంచేసుకుంటుందనే చెప్పాలి.