గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఈస్ట్ ఢిల్లీ ఎంపీ..

224
Green Challenge

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఉధృతంగా కొనసాగుతుంది. ఈరోజు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ సభ్యులు హంసరాజ్ హాన్స్ ఢిల్లీలోని తన నివాసంలో మొక్కలు నాటడం జరిగింది.

MP Hans Raj Hans

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ మహానగరంలో రోజు రోజుకు వాతావరణ కాలుష్యం పెరిగిపోతుందని దానివల్ల హాలిడేలు ప్రకటించవలసిన రోజులు వచ్చిందని.. కాబట్టి ఈ వాతావరణ కాలుష్యం తగ్గాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి కోరారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న నా తోటి పార్లమెంట్ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.