తెలంగాణపై బిజెపి సవతి తల్లి ప్రేమ-సుమన్

288
- Advertisement -

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సంబంధించి ఏ అంశం లేకపోవడం బిజెపి సవతి తల్లి ప్రేమకు నిదర్శనం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. వివక్ష పూరిత వైఖరి చూపిస్తే ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడరు.. మేధావులు అని చెప్పుకునే వారు స్పందించడం లేదు.. కేంద్ర బడ్జెట్‌పై ప్రశ్నించింది, నిరసన తెలిపింది కేవలం మా నాయకులు మాత్రమేనని ఆయన అన్నారు.ప్రతిపక్ష పార్టీలకు తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ఆశయాల పట్ల చిత్తశుద్ది లేదని సమన్‌ మండిపడ్డారు. మిషన్ భగీరథ, కాకతీయకు నీతిఅయోగ్ ఆర్థిక సహాయం చేయాలని చెప్పిన రూపాయలు లేదు. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని పొగిడింది. అయినా కాళేశ్వరంకు గాని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయ హోదా లేదని ఆయన అన్నారు.

అమిత్ షా వస్తే కనీసం బడ్జెట్ కేటాయింపులపై రాష్ట్ర బిజెపి నేతలు ఒక్క వినతి పత్రం కూడా ఇవ్వలే.. పని లేనివాళ్ళు ప్రభుత్వం మీద ఫ్రేస్టేషన్‌లో ఉన్న వాళ్ళు ఇవ్వాళ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు..తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తులు పెట్టిన రౌండ్ టేబుల్ సమావేశం అది.. మొండిగా, మూర్ఖంగా కొత్త అసెంబ్లీ, సచివాలయం వద్దంటూ మాట్లాడుతున్నారు. రాబోయే వందేండ్లకు అనుగుణంగా టెక్నాలజీతో నూతన భవనాలు కడుతున్నారు..ఇప్పటికే పార్లమెంట్ ఏవిధంగా ఉందో ఎన్నో భవనాలు అక్కడ ఉన్నాయో అలానే ఇక్కడ కడుతం.. అసెంబ్లీ కార్యకలాపాలు వీక్షకులు చూసేందుకు ప్రస్తుతం వీలు లేదు..సచివాలయానికి ఎక్కువమంది సందర్శకులు వస్తే ఇబ్బందిగా ఉంది.

MLA Balka Suman

భద్రత రీత్యా లోపాలు, కొన్ని భవనాలు బాగా లేవు.. అసెంబ్లీని కూలగొడుతున్నారని అవాస్తవాలు అపోహలు సృష్టిస్తున్నారు.. ఇప్పుడున్న అసెంబ్లీ భవనం హెరిటేజ్ భవనంగా కొనసాగిస్తాం. నూతన పార్లమెంట్ భవనం నిర్మించాలని గతంలో అప్పటి స్పీకర్ సుమిత్ర మహాజన్ కేంద్రానికి లేఖ రాశారు. అప్పటి కేంద్ర మంత్రి ముక్తాస్ అబ్బార్ నక్వీ కూడా ఇదే విషయం చెప్పారు.. వారిద్దరూ కూడా బిజెపి నేతలే. గుజరాత్ అసెంబ్లీ భవనం ఆధునీకరణ, మరమ్మతులకే 130కోట్ల ఖర్చు చేశారు. గుజరాత్‌లో ఉన్నది బిజెపి ప్రభుత్వం.. కానీ మన దగ్గర కొత్త అసెంబ్లీ భవనం కడుతామంటే ఇక్కడి బిజెపి నేతలు అడ్డుపడుతున్నారని బాల్క సుమన్‌ అన్నారు.

స్థానిక బిజెపి నేతలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఒకలా, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపట్ల మరోలా వ్యవహరిస్తున్నారు..కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు బిజెపి, అనుబంధ సంస్థ ఆరెస్సెస్‌పై పోరాడుతున్నామని అంటారు.. ఇక్కడేమో కూర్చులు పంచుకొని ఆలయ్, బలయ్ చేసుకుంటున్నారు. అక్కడ రాహుల్ గాంధీ ఒకటి మాట్లాడుతే.. ఇక్కడి కాంగ్రెస్ నాయకత్వం మరొకటి మాట్లాడుతది. తెలంగాణ ప్రజల అవసరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసు.. ఈ ప్రభుత్వం ఏ పని చేసిన గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారు.. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అవకాశం వస్తే వారికి గుణపాఠం చెబుతారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి మాకు పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తారు.. బిజెపి నేతలు రాష్ట్రంలో గురుకుల భవనాల కోసం హెచ్చర్డీ నుండి నిధులు ఇప్పించాలని ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం అన్నారు.

- Advertisement -