రాహుల్‌కు కనీస అవగాహన కూడా లేదు: అసద్

36
asad
- Advertisement -

ఏ అంశంపై మాట్లాడాలో రాహుల్‌కు కనీస అవగాహన కూడా లేదన్నారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాహుల్‌ తాను ఏ అంశంపై మాట్లాడాలో చెప్పాలని ఆ పార్టీ నేతలను అడిగిన వీడియో క్లిప్పింగ్‌ను చూశానని, ఏ అంశం పై మాట్లాడాలో కనీస అవగాహన లేకపోతే రాహుల్‌, ఆయన పార్టీ తెలంగాణకు ఏం ఒరగబెడుతుందని నిలదీశారు.

ఏ అం శంపై ఏం మాట్లాడాలో కూడా తెలియని రాహుల్‌.. తెలంగాణకు ఏం చేస్తారని, కాం గ్రెస్‌కు ప్రజలు ఎందుకు మద్దతిస్తారని ప్రశ్నించారు. ఆ పార్టీ అవసరం తెలంగాణకు లేదని స్పష్టంచేశారు. సరూర్‌నగర్‌లో ముస్లిం యువతిని వివాహం చేసుకున్న దళిత యువకుడిని హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.

- Advertisement -