కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్‌: కేటీఆర్

98
ktr
- Advertisement -

రాహుల్‌ గాంధీ తొలుత అమేథీలో గెలవడంపై దృష్టిసారించాలన్నారు మంత్రి కేటీఆర్. Ask KTR సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేటీఆర్…కాంగ్రెస్‌ అసలు పేరు ‘స్కాం’ గ్రెస్‌ అని ఆయన ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ ఇప్పుడు ఏ పదవిలో తెలంగాణకు వచ్చారో నాకు తెలియదన్నారు. తెలంగాణలో రిమోట్‌ జరగడం లేదని.. మీ కాంగ్రెస్‌ది రిమోట్‌ పాలన అని కేటీఆర్‌ మండిపడ్డారు. మీరు చెప్పినవన్నీ నమ్మేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా లేరని, ఇక్కడి ప్రజలకు అన్ని అంశాల పైనా అవగాహన ఉందన్నారు.

ఇక్కడ ప్రజలు మీకు 10 ఛాన్సు ఇచ్చారని, ఒక్క ఛాన్స్ అని విచిత్ర మాటలు రాహుల్ గాంధీ మాట్లాడారన్నారు. మమ్మి గారి పాలనలో డమ్మీ గారి తో పాలన చేసింది మీరని, ఆ నాడు ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చించేసిన మీరు రిమోట్ కంట్రోల్ పాలన గురించి మాట్లాడడం విడ్డురమన్నారు.

- Advertisement -