ఒక సినిమా తీయాలంటే హీరో హీరోయిన్లు ఇతర ఆర్టిస్టులు ఉంటే సరిపోదు… సినిమా తీయడానికి అంతకు మించి అన్నట్టు ఉంటుంది. ప్రతిసినిమాలో 24క్రాప్ట్‌లు ఉంటాయి. ఇందులో ఏ ఒక్కటి తక్కవైన సినిమా బాగుండదు…ఏలా అంటే కూరలో అన్ని ఇన్‌గ్రేడియంట్స్ వేసిన కూడా కూర బాగోలేకపోతే ఏలా ఉంటుందో అలా ఉంటుంది. ఇందుకోసం ఒక సినిమా కోసం చాలా కష్టపడుతుంటారు మూవీ మేకర్స్. అందుకు తగ్గట్టుగా భారీ బడ్జెట్ కూడా పెట్టడానికి వెనుకాడరు. అయితే సినిమా విడుదల అయిన తర్వాత సినిమా బాగుంటే ప్రేక్షకులు మళ్లీ మళ్లీ వస్తారు. బాగోలేకపోతే అసలే రారు. బాగున్న సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయని మనకు ఎలా తెలుస్తుంది. అందుకు కోసమే ప్రపంచవ్యాప్తంగా సినిమా అవార్డ్సు ఏర్పాటు చేయబడ్డాయి. అందులో హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ అంటూ ఏమాత్రము తేడా లేకుండా సినిమాను ఆదరిస్తే అవార్డుల పండుగే. ఇదంతా ఎందుకంటే రాజమౌళి నుంచి జాలువారిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు డ్యాన్స్‌కు గ్లోబల్ అవార్డు రావడమే ఇందుకు ప్రదానం కారణం.
అస్కార్
ఆస్కార్గా పిలిచే ఈ అవార్డు ప్రదానం అమెరికాలో 1929 నుంచి మొదలైంది. హాలీవుడ్ సహా ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సినిమాలు ఈ ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడుతుంటాయి.
గోల్డెన్ గ్లోబ్
సినిమా టెలివిజన్ షోలకు సంబంధించిన ప్రతిష్టాత్మక అవార్డు ఇది. 55దేశాలకు చెందిన 90మంది సభ్యులతో కూడిన హాలీవుడ్ ఫారెన్ ప్రెస్ అసోసియేషన్ 1944నుంచి ఈ పురస్కారాలను అందజేస్తుంది.
బఫ్తా అవార్డు
బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ సంస్థ ఇచ్చే ఈ అవార్డు కోసం దేశీయ సినిమాలతోపాటుగా అంతర్జాతీయ సినిమాలు పోటీ పడుతుంటాయి. 1949లో తొలి బఫ్తా అవార్డు ప్రదానోత్సవం జరిగింది.
గోల్డెన్ పామ్
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రానికి ఇచ్చే అవార్డు.
గోల్డెన్ లయన్
వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్తమ చిత్రానికి ఇచ్చే అవార్డు.
గోల్డెన్ బేర్
బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రానికి ఇచ్చే అవార్డు.
గోల్డెన్ లియోపర్డ్
లాకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రానికి ఇచ్చే అవార్డు.
నేషనల్ ఫిల్మ్ అవార్డు
ఏటా దేశీయంగా తెరకెక్కిన ఉత్తమ చిత్రానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ సంస్థ ఉత్తమ చిత్రాలకు నటులకు సాంకేతిక నిపుణులకు ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డున ప్రదానం చేస్తారు.
ఫిల్మ్‌ఫేర్ అవార్డు
భారతీయ సినీ రంగంలో ఫిల్మ్‌ఫేర్ అనేది మరో ప్రతిష్టాత్మక అవార్డు. మొదట్లో హిందీ చిత్రాలకు మాత్రమే ఇచ్చేవారు. ఆ తర్వాత ఫిల్మ్‌ఫేర్ సౌత్ పేరుతో దక్షిణాది చిత్రాలకు ఇతర పేర్లతో దేశీయ సినీ ఇండస్ట్రీలకు అవార్డులిస్తున్నారు.
గోల్డెన్ పీకాక్
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఉత్తమ చిత్రానికి ఇచ్చే అవార్డు.
గోల్డెన్ కోంచ్
ముంబాయి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్తమ చిత్రానికి ఇచ్చే అవార్డు.
ఐఫా అవార్డు
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ అవార్డుగా దీన్ని భావిస్తారు. ఎక్కువగా విదేశాల్లోనే ఈ అవార్డు వేడుక జరుగుతుంది. 2016నుంచి ఐఫా ఉత్సవం పేరుతో దక్షిణాది చిత్రాలకు అవార్డులు ప్రదానం చేస్తున్నారు.
గోల్డెన్ క్రో ఫెజెంట్
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళలో ఉత్తమ చిత్రానికి ఇచ్చే అవార్డు.
సైమా అవార్డు
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు తెలుగు తమిళ కన్నడ మలయాళ చిత్ర పరిశ్రమలో ఉత్తమ చిత్రాలకు ప్రతిభావంతులకు ఈ అవార్డును ఇస్తుంటారు.
ఇవి కూడా చదవండి…
బయటపడ్డ ప్రేమ పావురాలు
బాలయ్య ఓ రోజంతా తినలేదు!
మెగా ముచ్చట్లు.. కాస్త స్పైసీగా !