ప్రయాణంలో వాంతులా..ఇలా చేయండి!

38
- Advertisement -

చాలామంది ప్రయాణం చేసే సమయంలో వాంటింగ్స్ చేసుకుంటూ ఉంటారు. బస్సు ఎక్కిన లేదా కారు ప్రయాణం చేసిన కొందరిని ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. మరికొందరిలో అయితే దూర ప్రయాణం, గతుకులా ప్రయాణం, వంటివి చేస్తే వాంతులు చేసుకుంటూ ఉంటారు. ఈ సమస్య స్త్రీ పురుషుల ఇద్దరిలోనూ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ స్త్రీలలోనే ఎక్కువ. ఇక 14 ఏళ్ల లోపు పిల్లల్లో కూడా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది దీనికి మెడిసన్ కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది వ్యాధి కాదని వైద్యులు చెబుతున్నారు. బ్రెయిన్ అందుకునే సంకేతాలలో తడబాటు ఏర్పడితే ఈ సమస్య వస్తుందట..

ఇంకా కొందరిలో జన్యు పరమైన లోపల కారణంగా కూడా ప్రయాణ సమయాల్లో వాంతులు చేసుకుంటూ ఉంటారు. కొందరిలో వాంతులతో పాటు కళ్ళు తిరగడం, ఆయాసం, మూర్ఛపోవడం వంటి లల్క్షనాలు కూడా కనిపిస్తాయి. కాగా ఈ సమస్య నుంచి బయటపడడానికి ఇతరత్రా మెడిసన్స్ కంటే ఇంటి చిట్కాలు చక్కగా పని చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ఉన్నవారు ప్రయాణం చేసే సమయంలో నిమ్మకాయను వెంట తీసుకెళ్ళడం ఎంతో మంచిదట. ఎందుకంటే నిమ్మకాయలో ఉండే సిట్రిక్ ఆమ్లం వాంతులు రాకుండా నివారిస్తుంది. ఇక అలాగే లవంగాలు కూడా ప్రయాణ సమయాల్లో వాంతులను అడ్డుకుంటుంది.

Also Read:Bigg Boss 7 Telugu:చెత్తసంచాలక్‌తో గెలిచిన శోభా

కాబట్టి ప్రయాణంలో వాంటింగ్ అయ్యే సూచన కనిపిస్తే వెంటనే లవంగా ముక్కను నోట్లో వేసుకొని నమిలితే ఆ సమస్య దురమౌతుంది. ఇంకా ఉసిరి, యాలకలు, జీలకర్ర కూడా ఈ రకమైన సమస్యను దూరం చేస్తాయట అయితే వీటితో పాటు కొన్ని సూచనలు పాటించడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.. ప్రయాణంలో ఆల్కహాల్ సేవించడం, కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ టి వంటివి సేవించడం, మసాలా కలిగిన ఆహార పదార్థాలను తినడం వంటివి చేయకూడదట. ఇవన్నీ కూడా ఎసిడిటీకి కారణమై వాంతులకు దారి తీస్తుంది. కాబట్టి ప్రయాణ సమయాల్లో ఈ చిట్కాలు సూచనలు పాటిస్తే సుఖమైన జర్నీ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read:ఆమె ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ 

- Advertisement -