ఆమె ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ 

15
- Advertisement -

నయనతార ది దాదాపు ప‌దిహేనేళ్ల జ‌ర్నీ. ఈ సుదీర్ఘ‌మైన ప్ర‌యాణంలో  ఎన్నో సూప‌ర్ హిట్లు కొట్టింది ఈ లేడీ సూపర్ స్టార్. ఓ దశలో సౌత్ లో లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ల‌కు నయనతార  కేరాఫ్ గా నిలిచింది. పైగా రెమ్యునరేషన్ లోనూ సైతం నయనతార  ఎవ‌రికీ సాధ్యం కాని స్టార్ డ‌మ్ సంపాదించుకొంది. అయితే.. గత మూడేళ్ళ నుంచి నయనతార కు ఆశించిన స్థాయిలో బ్రేక్ దొరకలేదు. ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. దీనికితోడు నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకోవడం, పైగా ఆమెకు ఇద్దరు పిల్లలు కలగడం.. ఇవన్నీ కలిపి మొత్తానికి నయనతార పని అయిపోయింది అనుకున్నారు అందరూ.

ఈ ప్రచారానికి తగ్గట్టుగానే ఏడాది నుంచి  నయనతార ప్ర‌యాణం ఏమాత్రం ఆస‌క్తిక‌క‌రంగా సాగలేదు. దాంతో పాటుగా, బాగా ఒళ్లు చేసేయ‌డంతో, నయనతార సినిమాల‌కు దూర‌మవ్వడం ఖాయం అనుకున్నారు. ఇక నయనతార కెరీర్ ముగిసిన‌ట్టే అనుకొంటున్న ద‌శ‌లో షారుఖ్ ఖాన్ `జవాన్ `తో ఓ ఊహించ‌ని హిట్టు త‌న ఖాతాలో వేసుకొంది. నిజానికి ఈ సినిమాపై ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాల్లేవు. నయనతార కూడా ప్ర‌మోష‌న్ల‌కు రాలేదు. ద‌ర్శ‌కుడు అట్లీ పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. జవాన్ సినిమాలో నయనతార క్యారెక్టర్ కు పెద్దగా ప్రాధాన్యత ఉంటుందని ఎవరూ ఊహించలేదు.

Also Read:Samantha:చాలా స్టెరాయిడ్స్‌ తీసుకున్నాను

సో.. నయనతార పాత్ర పై పెద్దగా ఎవ‌రికీ న‌మ్మ‌కాల్లేవు.  కానీ… అనుహ్యాంగా జవాన్ సినిమాలో నయనతార పాత్ర ఆడియ‌న్స్‌కి న‌చ్చ‌డంతో  ఆమె కూడా మంచి విజ‌యాన్ని నమోదు చేసుకున్నట్లు అయ్యింది.  వెండి తెర‌పై నయనతార  స్క్రీన్‌ప్రెజెన్స్ కూడా బాగా ఆక‌ట్టుకొంది. దీంతో నయనతార మ‌రింత కాలం సినిమాలు చేయొచ్చ‌న్న భ‌రోసా క‌లిగించింది. తాజాగా బాలీవుడ్ లో నయనతారకు వరుస ఆఫ‌ర్లు వస్తున్నాయి. దాంతో నయనతార ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.

Also Read:రైల్వే కూలీగా మారిన రాహుల్!

- Advertisement -