టీడీపీ ఓటమితో సంబరాల్లో మోత్కుపల్లి..

181
mothkupalli narsimhulu

ఏపీలో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఏపీలో గెలుపుతో జాతీయస్ధాయిలో చక్రం తిప్పాలని భావించిన చంద్రబాబుకు ప్రజలు షాకిచ్చారు. కేవలం 25 స్ధానాలకే టీడీపీ పరిమితం అయ్యే పరిస్థితి నెలకొంది. అంతేగాదు ఒక్కటంటే ఒక్క ఎంపీ స్ధానంలోనూ టీడీపీ ఆధిక్యంలో లేదు.

ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఓటమిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు. ఆయన అనుచరులతో కలిసి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మోత్కుపల్లి శుభాకాంక్షలు తెలిపారు. దుర్మార్గుడి పీడ వదిలిందని రేపు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పిస్తా అని అన్నారు.

టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న మోత్కుపల్లి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ నుండి ఆయన్ని బహిష్కరించారు చంద్రబాబు. దీంతో సమయం దొరికినప్పుడల్లా చంద్రబాబు వైఖరిని తప్పుబడుతున్న ఆయన ఏపీలో టీడీపీ ఓటమిపై హర్షం వ్యక్తం చేశారు.