అఖిల్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్” ఫస్ట్ లుక్

399
MEB FIRSTLOOK - FINAL

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయ‌గానే సినిమా అభిమానులు నుంచి సాధ‌ర‌ణ ప్రేక్ష‌కులు వ‌ర‌కు విప‌రీత‌మైన పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో ట్రేండింగ్ అవ్వ‌డం ఈ సినిమాకి మీద ఉన్న క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. ఇక‌ అక్కినేని న‌ట వార‌సుడిగా హ్యాండ్ స‌మ్ హీరో అఖిల్ వైవిధ్య‌మైన క‌థ‌లు ఎంచుకుంటూ ఇటీవ‌లే మిస్ట‌ర్ మ‌జ్ను, హ‌లో వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌‌స్ట‌ర్స్ సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో అఖిల్ మ‌రోసారి త‌న‌ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చే స్టోరీతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ గా రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని బొమ్మ‌‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో నిర్మాత‌లు బ‌న్నీవాసు , వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. అలానే ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అఖిల్, పూజా హెగ్ధే మ‌ధ్య న‌డిచే కెమిస్ట్రీ ఈ సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతుందని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలిపారు. ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని ఫ‌స్ట్ లుక్ ని ఈ రోజు చిత్ర నిర్మాత‌లు విడుద‌ల చేశారు.