మేడారం జాతర నిర్వహణ భేష్‌: సీఎం కేసీఆర్‌

66
cm kcr

మేడారం జాతర దిగ్విజయంగా పూర్తవడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతృప్తి వ్యక్తంచేశారు. అన్నిశాఖల సమన్వయం వల్లే జాతర దిగ్విజయంగా జరిగింది. గతంలో ఎన్నడూలేని విధంగా ట్రాఫిక్‌ సమస్య లేకుండా చూశారని మెచ్చుకున్నారు. ప్రభుత్వ సిబ్బందికి సహకరించిన ప్రజలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నాయకత్వంలోని అన్నిశాఖల అధికారులు, డీజీపీ మహేందర్‌రెడ్డి నేతృత్వంలోని పోలీసులు రేయింబవళ్లు పనిచేసి, భక్తులకు సేవలు అందించారని అభినందించారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, జాతర నిర్వాహకులు, పూజారులు, వనదేవతల వారసులు అందరికీ అభినందనలు తెలిపారు. ట్రాఫిక్‌కు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా, క్యూలైన్లలో తొక్కిసలాటలు లేకుండా, డీజీపీ నేతృత్వంలోని పోలీసులు సమగ్రవ్యూహంతో వ్యవహరించారని అన్నారు.