2020-21 జీహెచ్ ఎంసీ బడ్జెట్

559
Ghmc Mayor
- Advertisement -

2020-21 సంవ‌త్స‌రానికి న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌ను శ‌నివారం జ‌రిగిన జిహెచ్ఎంసి స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ఏక‌గ్రీవంగా ఆమోదించింది. మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన జిహెచ్ఎంసి స‌మావేశానికి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌, ఎంపీలు ఎ.రేవంత్‌రెడ్డి, జి.రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎం.ఎస్‌.ప్ర‌భాక‌ర్‌రావు, స‌య్య‌ద్ అమినుల్ హ‌స‌న్ జాఫ్రీ, మిర్జా రియాజ్ ఉల్‌ హ‌స్స‌న్ ఎఫింది, ఎమ్మెల్యేలు కాలేరు వెంక‌టేష్, జాఫ‌ర్ హుస్సేన్‌, కౌస‌ర్ మోయినుద్దీన్‌, స‌య్య‌ద్ ల‌హ్మ‌ద్ పాషా ఖాద్రి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్‌, ఎక్స్అఫిసియో స‌భ్యులు, కార్పొరేట‌ర్లు, అధికారులు పాల్గొన్నారు.

             మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ఆధ్వ‌ర్యంలో  సి.ఏ.ఏకు వ్య‌తిరేకంగా జిహెచ్ఎంసి కౌన్సిల్ స‌మావేశంలో ఏక‌గ్రీవంగా ఆమోదించారు. దేశంలోనే మొట్ట‌మొద‌టి సారి సి.ఏ.ఏకు వ్య‌తిరేకంగా తీర్మానం చేసిన కార్పొరేష‌న్‌గా జిహెచ్ఎంసి నిలిచింది. కేంద్ర ప్ర‌భుత్వం రూపొందించిన సి.ఏ.ఏకు వ్య‌తిరేకంగా  డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్ బ‌ల్దియా స‌మావేశంలో తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు.

 ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ మాట్లాడుతూ… సెక్యుల‌రిజానికి నిద‌ర్శ‌నంగా ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్ నిలుస్తున్నార‌ని, కేంద్ర ప్ర‌భుత్వం రూపొందించిన సి.ఏ.ఏ కు వ్య‌తిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామ‌ని ప్ర‌క‌టించిన‌ట్లు తెలిపారు.  ముఖ్య‌మంత్రిని స్ఫూర్తిగా తీసుకొని సి.ఏ.ఏను వ్య‌తిరేకిస్తూ ప్ర‌తిపాదించిన తీర్మానం ప్రాధాన్య‌త‌ను వివ‌రించారు. దీనికి స‌మావేశంలో అంద‌రూ ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపారు. అలాగే భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాలు, శిథిలాల‌పై విధిస్తున్న జ‌రిమానాల పై స‌మావేశంలో వ్య‌క్త‌మైన అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని  అద్య‌య‌నం చేసేందుకు ఒక క‌మిటిని నియ‌మించాల‌ని కౌన్సిల్ స‌మావేశంలో తీర్మానించారు. న‌గ‌రంలో చేప‌ట్టిన డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ప్ర‌భుత్వం రూ.  1800 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు తెలిపారు. ఫినిషింగ్ స్టేజ్‌లో ఉన్న 65వేల ఇళ్ల‌ను జులై -ఆగ‌ష్టు నాటికి పూర్తిచేసి ల‌బ్దిదారుల‌కు అంద‌జేయ‌నున్న‌ట్లు మేయ‌ర్ రామ్మోహ‌న్ తెలిపారు.

ఈ ఇళ్ల పూర్తికి దాదాపు రూ. 90కోట్లు అవ‌స‌రం అవుతాయ‌ని ప్ర‌భుత్వానికి నివేదించిన‌ట్లు తెలిపారు. ఇళ్ల ల‌బ్దిదారుల ఎంపిక జిహెచ్ఎంసి ప‌రిధిలోని నాలుగు జిల్లాల క‌లెక్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తించిన 5,700 మంది ల‌బ్దిదారుల వివ‌రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన‌ట్లు తెలిపారు. స్థానిక సంస్థ‌లకు కేటాయించే నిధుల అంశంపై రాష్ట్ర ఫైనాన్స్ క‌మిష‌న్‌తో జిహెచ్ఎంసి చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లోనే స్టేట్ ఫైనాన్స్‌ క‌మీష‌న్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి నివేదిక అంద‌జేస్తుంద‌ని తెలిపారు. త‌ద‌నుగుణంగా జిహెచ్ఎంసి అద‌న‌పు నిదులు ల‌భించే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. అదేవిధంగా న‌గ‌ర శివార్ల‌లో  సీవ‌రేజ్ వాట‌ర్‌, స్ట్రామ్ వాట‌ర్  డ్రెయిన్ల స‌మ‌స్య‌ను అదిగ‌మించేందుకు హైద‌రాబాద్ మెట్రో వాట‌ర్ వ‌ర్క్స్ కు అప్ప‌గించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు వాట‌ర్ వ‌ర్క్స్‌తో చేసుకునే ఒప్పందం అమ‌లులోకి వ‌చ్చేలోపు ప‌నులను కొన‌సాగించుట‌కు వాట‌ర్ వ‌ర్క్స్ అధికారుల‌తో చ‌ర్చిస్తున్న‌ట్లు తెలిపారు. గ‌రంలో పారిశుధ్యాన్ని పెంచుట‌కు పార్కుల అభివృద్దికి రూ. 50 నుండి 60 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి జోన్‌లో 500 చొప్పున న‌గ‌రంలో 3వేల ప‌బ్లిక్ టాయిలెట్ల‌ను ఆధునిక డిజైన్ల‌తో నిర్మించనున్న‌ట్లు తెలిపారు.

ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్, మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో న‌గ‌రం కొత్త హంగులు సంత‌రించుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. మ‌నం మారుదాం మ‌న న‌గ‌రాన్ని అందంగా స్వ‌చ్ఛంగా మారుద్దాం అనే నినాదం స్ఫూర్తితో స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌- 2020 నేప‌థ్యంలో ఈ బ‌డ్జెట్‌ను రూపొందించిన‌ట్లు వివ‌రించారు. 2020-21 వార్షిక బ‌డ్జెట్‌ను రెండు విభాగాలుగా చేసిన‌ట్లు తెలిపారు. మొత్తం బ‌డ్జెట్ రూ. 6973 కోట్ల 64ల‌క్ష‌లు ఉంటే దానిలో జిహెచ్ఎంసికి రూ. 5380 కోట్లుగా నిర్థారించిన‌ట్లు తెలిపారు. మౌలిక వ‌స‌తుల అభివృద్దికి ఏర్పాటుచేసిన ఇత‌ర కార్పొరేష‌న్లుగా ఉన్న హైద‌రాబాద్ రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ మ‌రియు హౌసింగ్ కార్పొరేష‌న్ కు ఇచ్చే నిధులు రూ. 1593 కోట్ల 64 ల‌క్ష‌లను కూడా ఈ బ‌డ్జెట్‌లో చేర్చిన‌ట్లు తెలిపారు. ఈ నిధుల‌ను కూడా జిహెచ్ఎంసి ద్వారానే ఖ‌ర్చుచేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. జిహెచ్ఎంసి రెవెన్యూ ఆదాయం రూ. 3667 కోట్లు కాగా రూ. 603 కోట్ల మూల‌ధ‌న ఆదాయం క్యాపిట‌ల్ రిసీట్స్ గా, మిగిలిన నిధుల‌ను బాండ్లు, బ్యాంకు రుణాల రూపంలో సేక‌రించ‌డం జ‌రుగుతుంది. రెవెన్యూ ఆదాయాన్ని ప‌రిశీలిస్తే అధిక శాతం రూ. 1,803 కోట్లు ఆస్తిప‌న్ను రూపంలో ల‌భిస్తుంది. రెవెన్యూ వ్య‌యం రూ. 2750 కోట్లు కాగా పెట్టుబ‌డి వ్య‌యం రూ. 2630 కోట్లు కేటాయించారు.

ఎస్‌.ఆర్‌.డి.పి కింద రూ. 3500 కోట్ల ప‌నుల‌లో బాండ్లుగా రూ. 1000 కోట్లు, బ్యాంకు రుణం ద్వారా రూ. 2500 కోట్లు నిధులుగా సేక‌రించాల‌ని గ‌తంలో తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు 2017-18లో మొద‌టి విడుత‌గా బాండ్ల ద్వారా రూ. 200 కోట్లు, 2018-19లో రెండో విడ‌త‌గా రూ. 195 కోట్లు, 2019-20లో మూడో విడ‌త‌గా రూ. 100 కోట్లు మొత్తం రూ. 495 కోట్ల‌ను బాండ్ల ద్వారా తీసుకోవ‌డం జ‌రిగింది. ఎస్‌.బి.ఐ క్యాబ్స్ ద్వారా తీసుకుంటున్న రూ. 2,500 కోట్ల రుణంతో ఎస్‌.ఆర్‌.డి.పి ప‌నుల‌ను వేగంగా పూర్తిచేయ‌డం జ‌రుగుతుంది. అలాగే రూ. 1393 కోట్ల 64ల‌క్ష‌ల అంచ‌నా నిధుల‌ను డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ఖ‌ర్చు చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నుండి గ్రాంట్ల ద్వారా జిహెచ్ఎంసి పొందుతుంది. నిధుల కేటాయింపు అంశానికి వ‌స్తే రోడ్ల అభివృద్ది ప్ర‌ణాళిక‌కు రూ. 1,639.80 కోట్లు, బ్రిడ్జిలు, ఫ్లైఓవ‌ర్లు, స‌బ్‌వేల‌కు రూ. 94.45 కోట్లు, మురుగునీరు, మంచినీటి స‌ర‌ఫ‌రా, స్ట్రామ్ వాట‌ర్ డ్రైనేజికి రూ. 326 కోట్లు, వీధిదీపాల ఏర్పాటుకు రూ. 22 కోట్లు కేటాయించ‌డం జ‌రిగింది. గ‌త సంవ‌త్స‌రం వ‌లే ఇప్పుడు కూడా ఎస్సీ వ‌ర్గాల‌వారి ప్రాంతాల అభివృద్దికి రూ. 48కోట్లు, ఎస్టీ వ‌ర్గాల ప్రాంతాల అభివృద్దికి రూ. 19 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్న‌ది. ఈ స‌మావేశంలో పార్ల‌మెంట్‌, శాస‌న మండ‌లి, శాస‌న స‌భ స‌భ్యుల‌తో పాటు కార్పొరేట‌ర్లు క‌లిపి మొత్తం (132) మంది హాజ‌రైనారు.

- Advertisement -