మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ @ 50 కోట్లు

157
meb
- Advertisement -

టాలీవుడ్‌ హీరో అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈమూవీ ఇప్పటికే పూర్తై విడుదలకు సిద్ధంగా ఉంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మించగా కెరీర్‌లో తొలి విజయాన్ని అందుకున్నారు అఖిల్.

తొలి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో 50 కోట్ల క్లబ్‌లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చేరిందని తెలుపుతూ మేకర్స్ ఓ తాజా పోస్టర్‌ను వదిలారు.

పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉండాలనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో యూత్ ఫుల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా దర్శకుడు భాస్కర్ ఈ దీనిని రూపొందించారు.

- Advertisement -