ఏంతటి వ్యక్తైనా సరే కాలాన్నికి బద్దుడై ఉండాల్సిందే. వివిధ కాలాల్లో వచ్చే వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉంటారు. కానీ వాతావరణం అందరికీ కలిసి రాదు. కొందరికి ఆరోగ్యం మరికొందరికి ఆనారోగ్యం. ఇవే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ప్రభావం చూపించబోతుంది. రష్యా అమ్ములపొదిలో ఉన్న ఆయుధాన్ని ఉక్రెయిన్‌పై వాడబోతుందని అంతర్జాతీయ మీడియా కథనాలు.
రష్యా తన వద్ద ఉన్న ప్రకృతి ఇచ్చిన అత్యంత శక్తిమంతమైన ఆయుధం ఏంటో తెలుసా. ఈ ఆయుధంతో ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్‌ను సైతం భయపడి పారిపోయేలా చేసింది. ఈ ఆయుధం వల్ల నెపోలియన్ రష్యన్ల వద్ద మోకరిల్లాడు.
తాజాగా ఉక్రెయిన్, నాటో సేనలకు వ్యతిరేకంగా ఈ ఆయుధాన్ని వాడేందుకు మాస్కో సిద్ధమవుతోంది. కానీ నాటోకు ఈ ఆయుధాన్ని చూసి ఆందోళన చెందుతోంది. ఆ ఆయుధమే శీతాకాలం. ప్రపంచంలో రష్యన్లు ఓడిపోయే సమయంలోనూ, కీలక యుద్ధాల్లో విజయాన్నందించిన చలికాలాన్ని మాస్కో గౌరవంగా జనరల్ వింటర్ లేదా జనరల్ ఫ్రాస్ట్ అని అంటారు.
రష్యాలో శీతాకాలంలోని యుద్ధ సమయం చాలా కీలకం. ఈ సీజన్‌లో రష్యన్లపై దండయాత్ర చేసిన ఏ దేశము కూడా గెలవలేదు. ఇందుల్లో కేవలం రష్యన్లు ప్రత్యర్థులకు అవసరమైన వనరులు అందకుండా చేస్తూ… ఆత్మరక్షణ వ్యూహాన్ని పాటిస్తారు. ఎముకలు కొరికే చలే ప్రత్యర్థిని చంపేస్తుంది. ఈ యుద్దంలో ఉక్రెయిన్ గెలవాలంటే ముందుగా చలిని గెలవాలి.
ఈ చలిలో సైనికులు ముందుకు వెళ్లాలంటే సాధారణ వాహనాలు సరిపోవు. ఆయుధాలు ప్రత్యేకమైనవి కావాలి వాటికి ప్రత్యేకంగా ఆయుధాల కోసం తయారుచేసిన ల్యూబ్రికేంట్లు ఉపయోగించాలి. దళాలకు ప్రత్యేకమైన బూట్లు దుస్తులు అవసరం. వీటితో పాటు ఖచ్చితంగా ఉష్ణం ఉండాల్సిందే. లేదంటే సైనికుల ఎముకలు కొరికే చలిలో నిలబడి కలబడలేరు.
చరిత్రలో కూడా అంతే…
- రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ మాస్కోను ఆక్రమించుకోవడానికి 1941సెప్టెంబర్‌లో ఆపరేషన్ బార్బరోస్సాను మొదలు పెట్టారు. కానీ దాడి పూర్తిగా కాక ముందే…జర్మన్లు 30లక్షల మంది సైనికులు చలికి ఆహూతయ్యారు. డిసెంబర్‌లో సోవియట్ సేనలు ఎదురుదాడి మొదలు పెట్టి జర్మనీ సేనలను తరిమికొట్టాయి. ఈ ఓటమితో రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ పతనం మొదలైంది.
- 1812లో నెపోలియన్‌సేనలు మాస్కోను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించి దెబ్బతింది. ఒక్కరోజు రాత్రే 10వేల మంది ఫ్రెంచ్ సేనలు మరణించారు.
- 1708లో కూడా స్వీడన్ రష్యాను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిచింగా దాదాపుగా 20వేల మంది సైనికులు మరణించారు. దీంతో స్వీడిష్ యుద్ధంలో ఓడిపోయి సామ్రాజ్యం పతనం మొదలైంది.
రష్యా నుంచి వీడిపోయిన ఉక్రెయిన్ శీతాకాలం పరిస్థితుల గురించి తెలుసు. దీనికి తోడు నాటో సభ్యదేశాలు ఉక్రెయిన్‌కు సాయంపై ఇటీవల సమావేశమైంది. ఇప్పటికే రష్యా తన ఆధిపత్యంను నిరూపించుకోవడానికి ఉక్రెయిన్‌కు కావాల్సిన విద్యుత్తు, తాగునీటి వ్యవస్థలపై తీవ్రంగా దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తుంది.
ఇప్పటికే జపొరిజియా అణుకేంద్రంను రష్యా స్వాధీనం చేసుకొని విద్యుత్త్‌ను నిలిపివేసింది. దీంతో పాటు తాగునీటి సరఫరాలపై రష్యన్లు దాడులు చేయడంతో ఉక్రెయిన్ పరిస్థితి దారుణంగా దెబ్బతింటుంది.
చలి పెరిగే కొద్దీ ఇళ్లలో ఉష్ణం లేక ప్రజలు వలసపోవడమో..చలికి బలికావడమో లాంటి పరిస్థితులు ఏర్పాడతాయి. దీంతో ఉక్రెయిన్ ప్రజలు సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారు. ఉక్రెయిన్‌కు గత్యంతరం లేక ఓడిపోవాల్సి వస్తుంది. ‘శీతా’ కాలం గాయం మాన్పుతుందో లేక పెంచుతుందో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి..
చలికాలంలో వేడినీళ్లు.. చన్నీళ్లు.. ఏది బెటర్
మానవ శరీరం…అదిరిపోయే నిజాలు
రాహుల్‌కు కేటీఆర్ చురకలు..