బత్తాయిలు తిని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి..

228
Mosambi fruits distributors in ramgundam
- Advertisement -

ఈ రోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని దుర్గానగర్‌లోని ఆర్కే గార్డెన్‌లో మే 10 బత్తాయి దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు,వైద్య సిబ్బందికి,పారిశుద్ధ్య కార్మికులకు బత్తాయి పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం రామగుండం పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ,ఎమ్మెల్యే చందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

Mosambi fruits distributors in ramgundam

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… కరోనా వైరస్ నివారణలో భాగంగా పోలీసు వైద్య పారిశుద్ధ కార్మికుల సేవలు అమోఘమని, వారి సేవలకు వెలకట్టలేనివి అని సీపీ అన్నారు. ప్రజా ప్రాణ రక్షణే కింకర్తవ్యంగా భావించి సేవలందిస్తూ కరోనా కట్టడికి తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి రోగనిరోధక శక్తి క్షీణించడమే ప్రధానంగా ఉంటుందని ఈ దశలో రోగనిరోధక శక్తిని పెంచే బత్తాయిని వినియోగించడం ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే చందర్. అంతేకాక రోగనిరోధకశక్తిని పెంచే విటమిన్ సి బత్తాయిలోనే అధికంగా ఉంటుందన్నారు. పళ్ళతో పాటు బత్తాయి జ్యూస్‌ను వినియోగించి ప్రజలంతా ఆరోగ్యవంతులుగా ఉండాలని అన్నారు.

Mosambi fruits distributors in ramgundam

అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు,పోలీస్ సిబ్బందికి,వైద్య సిబ్బందికి సీపీ,ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్,డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక రావు బత్తాయిలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోదావరిఖని సబ్ డివిజినల్ ఏసిపి ఉమెన్ దర్,రామగుండం ట్రాఫిక్ ఏసీపీ ఏ రామ్ రెడ్డి,రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జి. రమేష్‌బాబు, గోదావరిఖని వన్ టౌన్ సీఐ పర్ష రమేష్, రామగుండం ట్రాఫిక్ ఎస్ఐ లు, సూర్యనారాయణ, కమలాకర్, వన్ టౌన్ ఎస్ .ఐ పి.ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.

- Advertisement -