తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వెదర్ రిపోర్టును అందించారు వాతావరణ శాఖ అధికారులు.ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలలో 7.6 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు రేపు కొన్నిచోట్ల, ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్ , కోమురంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి , జయశంకర్ భూపాలపల్లి , ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.