రాజస్థాన్ లోని మరికొన్ని ప్రాంతాలు, పంజాబ్ లోని మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ హిమాలయ ప్రాంతం, హర్యానా, చండీఘర్ మరియు ఢిల్లీ లోని మొత్తం ప్రాంతాలు మరియు ఉత్తరప్రదేశ్ లోని మరికొన్ని ప్రాంతాల నుండి నైఋతి రుతుపవనాలు ఉపసంహరించాయి. ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒరిస్సా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలలో 7.6 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్లే కొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. దీని ప్రభావం వలన రాగల 48 గంటలలో దక్షిణ ఒరిస్సా తీరానికి దగ్గరలో వాయువ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఈరోజు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు ఆదిలాబాద్, కోమురంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్-పట్టణ మరియు వరంగల్-గ్రామీణ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లాలలో ఈరోజు ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.