బీసీల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు..

262
trs
- Advertisement -

బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షడుగా ఎన్నికైన కె .లక్ష్మణ్ టీఆర్‌ఎస్‌ పార్టీపై చేసి వ్యాఖ్యలను ఎమ్మెల్యే కె.పి.వివేకానంద త్రీవంగా వ్యతిరేకించారు. టీఆర్‌ఎస్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ లక్ష్మణ్ కు ముందుగా అభినందనలు తెలిపారు. బీసీ లు టీఆర్‌ఎస్‌ కు దూరమవుతున్నారనే లక్ష్మణ్ అభిప్రాయం శుద్ధ తప్పు అన్నారు. ప్రతి ఎన్నికల్లో బీసీలు టీఆర్‌ఎస్‌కు అండగా ఉన్నారని లక్ష్మణ్ గ్రహించాలి. లక్ష్మణ్ కు దమ్ముంటే కేంద్రంలో ఓబీసీల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయించాలి అని సవాల్‌ చేశారు.

బీసీలను పక్కన పెట్టిన పార్టీ బీజేపీ..లక్ష్మణ్ ది డమ్మీ పోస్టు.. లక్ష్మణ్ కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో బీసీలకు ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నించాలి. లక్ష్మణ్ ముషీరాబాద్‌లో మూడో స్థానానికి పడిపోయారు. ఇలా అబద్దాలు మాట్లాడితే లక్ష్మణ్ పెద్ద నేత కాలేరు అన్నారు. హైదరాబాద్ లో కూర్చుని మాట్లాడటం బీజేపీ నేతలకు అలవాటే..తెలంగాణ బీసీల కోసమే వచ్చిందా అనే రీతిలో కెసిఆర్ పాలన ఉంది. ఇది చూసి లక్ష్మణ్ జాగ్రత్తగా మాట్లాడాలి అని ఎమ్మెల్యే కె .పి .వివేకానంద తెలిపారు.

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ తన రాజకీయ పబ్బం కోసం మతాలు ,కులాల మధ్య చిచ్చుపెడుతోంది. బీసీల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ది పొందుతున్న అత్యధికులు బీసీ లు కారా ? అని ప్రశ్నించారు. బీసీలకు పెద్ద పీట వేస్తోంది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే..బీసీలకు పార్టీ పదవుల్లో న్యాయం జరగలేదని బీజేపీలో కొట్లాట జరుగుతోంది. సరిహద్దు సమస్యలు పరిష్కరించలేని బీజేపీ మిగతా సమస్యలు పరిష్కరిస్తుందా ? అని ఎమ్మెల్యే మల్లయ ఎద్దేవ చేశారు.

ఎమ్మెల్యే నన్నప నేని నరేందర్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌కు బీసీల ఆదరణ ఉంది కనుకే బీజేపీ 100 అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది.బీజేపీ కి బీసీలు దగ్గరవుతున్నారని లక్ష్మణ్ కంటున్న కలలు కల్లలు కాక తప్పదు. మత రాజకీయాలు తప్ప బీజేపీకి ఏదీ చేత కాదు. బీసీలు ఎప్పటికీ టీఆర్‌ఎస్‌ వైపే ఉంటారని ఎమ్మెల్యే నరేందర్‌ అన్నారు. ఈ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ ,ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ,ఎమ్మెల్యేలు కె .పి .వివేకానంద ,నన్నపనేని నరేందర్ ,మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు.

- Advertisement -