కేసీఆర్ దేశ్ కీ నేత: వినయ్ భాస్కర్

124
Vinay Bhaskar

బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షడు కె .లక్ష్మణ్ టీఆర్‌ఎస్‌ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. లక్ష్మణ్ బీజేపీ ఓబీసీ చైర్మన్ కాగానే బీసీలు బీజేపీ వెంట వెళతారా ? అని ఎద్దేవ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీలకు చేయని పనులను తెలంగాణలో మేమే చేస్తున్నాం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హాయంలోనే బీసీలకు అభివృద్ధి ,సంక్షేమ ఫలాలు దక్కుతున్నాయి అన్నారు. బుధవారం తెలంగాణ భవన్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు ప్రభుత్వ ఛీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గత పాలకులు బీసీలను నిర్లక్ష్యం చేస్తే కెసిఆర్ ఆదరించారు. కుల వృత్తులకు పునర్ వైభవం తెచ్చింది సీఎం కెసిఆర్ గారే. కెసిఆర్ దేశ్ కీ నేత అంటూ మిగతా రాష్ట్రాల వారు ప్రశంసిస్తున్నారు. మోడీ హాయంలో ఆర్ధిక రంగం చితికి పోయింది. కరోనా సమయంలో వలస కార్మికులను మోడీ నిర్లక్ష్యం చేస్తే కెసిఆర్ వారిని ఆదుకున్నారు. బీసీలు టీఆర్‌ఎస్‌ కు దూరమవ్వడం కాదు..అన్ని వర్గాలు మోడీకి దూరమవుతున్నాయి. ఈ వాస్తవాన్ని లక్ష్మణ్ గ్రహించాలి. బీసీల కోసం ఇక్కడ చేస్తున్న పనులను తమ రాష్ట్రాల్లో కూడా చేయాలనీ అక్కడ కుల సంఘం నేతలు కోరుకుంటున్నారు. సమయం ,సందర్భం వచ్చినపుడు కెసిఆర్ దేశానికి నేత అవుతారని వినయ్‌ బాస్కర్‌ తెలిపారు.