రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు..

241
Monsoon
- Advertisement -

నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్‌.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 7వ తేదీ వరకూ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నామని, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలియజేసింది.

Monsoon

ఇప్పటికే కర్ణాటక, తమిళనాడులోని చాలా ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు.. రెండ్రోజుల్లో రాయలసీమ, మహారాష్ట్ర ప్రాంతాలకు పూర్తిగా విస్తరిస్తాయని తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, విదర్భ పరిసరాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఆవరించాయి. ఎండ తీవ్రత, ఉక్కపోతతోపాటు నైరుతి గాలుల ప్రభావం కొనసాగుతోంది.

వీటన్నింటితో తెలంగాణ, కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి. అదే విధంగా రాబోయే 24 గంటలు కూడా రెండు రాష్ట్రాల్లో ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గుముఖం పట్టాయి.

- Advertisement -