ఈ ఏడాది సాధారణ వర్షపాతం.. ఐఎండీ వెల్లడి..

227
- Advertisement -

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కారణంగా సాధారణ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి రుతుపవనాల రాక ఆలస్యమైనా సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలతో 101 శాతం వర్షాలు కురుస్తాయని చెప్పింది. మధ్య భారతంలో వర్షపాతం సాధారణం కన్నా అధికంగా ఉండొచ్చని అంచనా వేసింది.

ఉత్తర, దక్షిణ భారతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని చెప్పింది. ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాయవ్య భారతంలోనూ సాధారణ వర్షాలు కురుస్తాయంది. పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లోని నీటి ఉపరితల ఉష్ణోగ్రతల ప్రభావం భారత్ లో వానాకాలంపై ఉంటుందని, ఈ నేపథ్యంలోనే అక్కడి ఉష్ణోగ్రతల్లోని మార్పులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని వాతావరణ శాఖ పేర్కొంది.

- Advertisement -