11వ రోజుకు చేరిన ఎంపీ సంతోష్ అన్నదానం..

39
Annadanam

దేశానికి వెన్నెముక లాంటి రైతులు లాక్ డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతు కూలీలకు అండగా నిలవాలని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నడుం బిగించారు. లాక్ డౌన్ పూర్తి అయ్యేంతవరకు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో కార్యాలయం యందు రైతులందరికీ, హమాలీ, చాట, సడెం, దడువాయి అందరికీ అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమంను ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు,ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,మాజీ ఎమ్మెల్యే కోడూరు సత్యనారాయణ గౌడ్‌లు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుక అనిత-ఆంజనేయులు, బోయినిపల్లి జెడ్పిటిసి కత్తెరపాక ఉమ-కొండయ్య ,బోయినిపల్లి ఎంపీపీ వేణుగోపాల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ లక్ష్మీ రాములు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొలిపాక మల్లికార్జున్, చట్ల పురుషోత్తం, మార్కెట్ కమిటీ సిబ్బంది , తదితరులు పాల్గొనడం జరిగింది. ఇంత గొప్ప అన్నదాన కార్యక్రమన్ని మన కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహిస్తున్నందుకు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేసిన కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎలుక అనిత.